![]() |
![]() |
.webp)
ఓ సినిమా బాగుంటే ఇతర భాషల్లోకి అనువదించి దానిని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తారు. కానీ ఈటీవి విన్ లో కొంతకాలం క్రితం తెలుగు భాషలో విడుదలైన #90's వెబ్ సిరీస్ ని పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు ఇందులో రఘు పాత్రలో నటించిన మౌళి తనూజ్ ప్రశాంత్.
ఈ వెబ్ సిరీస్ లో చంద్రశేఖర్ పాత్రలో శివాజీ, రఘుగా మౌళీ తనూజ్ ప్రశాంత్, రాణీగా వాసుకీ ఆనంద్, ఆదిత్యగా రోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ సిరీస్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే . వ దశకంలో టీవీలో ప్రసారమయ్యే చక్రవాకం, మొగలి రేకులు, ఆదివారం మాత్రమే వచ్చే సినిమా కోసం వారమంతా ఎదురుచూసే రోజులు ఇలా ఎన్నో జ్ఞాపకాలని మళ్ళీ ఈ జనరేషన్ లో అమ్మనాన్నలుగా ఉన్న #90 's వాళ్లకి చూపించారు దర్శకుడు ఆదిత్య హాసన్. ప్రతీ పాత్రని ఆ నేటివిటికి తగ్గట్టుగా, మాట్లాడే భాషలోను జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. అయితే ఏ సీను ఎక్కువ కాకుండా ఎంత ఉంచాలో అంతే ఉంచారు మేకర్స్. ఓ మధ్యతరగతి కుటుంబంలో పండగనో, ఎవరైనా బంధువులు వస్తేనో చేసుకునే మటన్ కర్రీ దగ్గర నుండి డబ్బులు చాలక టీవీ కనెక్షన్ తీపించే సీన్, రెగ్యులర్ అమ్మ ఉప్మా చేసే సీన్లు ఇలా అన్నీ ఆ జనరేషన్ లో ఫేస్ చేసిన ఇష్యూలని చాలా క్లారిటీగా చూపించారు మేకర్స్. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు చేసిన వెబ్ సిరీస్ ఇది.
హౌస్ నుండి శివాజీ బయటకొచ్చాక ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఇది విజయాన్ని సొంతం చేసుకోవడంతో సక్సెస్ మీట్ లు ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సిరీస్ లోని 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని' అనే పాటకి వచ్చే బిజిఎమ్ .. ఆ సీన్ లో ఆదిత్యగా చేసిన రోహన్ పాత్ర.. ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఈ సాంగే వినబడుతుంది. అయితే ఈ సిరీస్ లో రఘుగా చేసిన మౌళి తనూజ్ ప్రశాంత్.. ఇన్ స్టాగ్రామ్ లో తెగ ప్రమోషన్స్ చేస్తున్నాడు. సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని నలువైపులా వెళ్ళి.. సిరీస్ ని చూడమని చెప్తున్నాడు. అయితే ఇది ఒక్క తెలుగులోనే రిలీజ్ అయింది. మిగతా భాషల్లోకి తర్జుమా చేసి రిలీజ్ చేస్తే మరింత హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాగా తీసుకొస్తే ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ని పాన్ ఇండియా సిరీస్ గా చేసే పనిలో పడ్డాడు మౌళి.
![]() |
![]() |